Hyderabad, సెప్టెంబర్ 22 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభయోగాలు, శుభయోగాలు ఏర్పడడం సహజం. దీపావళి, దసరా వంటి పండుగలు అక్టోబర్ నెలలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు కూడా ఉండబోతోంది. అక్టోబర్ 2025లో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని వారి రాశులను మారుస్తున్నారు.

దీంతో ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడు అక్టోబర్ నెలలో రెండు సార్లు తన సంచారాన్ని మారుస్తాడు. అక్టోబర్ 3న బుధుడు తులా రాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 24న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 17న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.

అలాగే అక్టోబర్ నెలలో సూర్యుడు, బుధుడు కలిపి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అక్టోబర్లోనే కుజుడు వృశ్చిక రాశిలోకి ...