Hyderabad, అక్టోబర్ 6 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగిపోతుంది. ఐదో వారం బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ హరిత ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించిన బిగ్ బాస్ అందరిని డైరెక్ట్ నామినేట్ చేశాడు.

దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 అక్టోబర్ 6 ఎపిసోడ్ నాటి ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో కంటెస్టెంట్స్ అందరిని బయట గార్డెన్‌లోకి రమ్మని ఆదేశించాడు బిగ్ బాస్. "బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు" అని బిగ్ బాస్ అన్నాడు.

అప్పుడు కొంతమంది మొహాలు చూపించారు. అయితే, బిగ్ బాస్ అందరి పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. "ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది" అ...