Hyderabad, అక్టోబర్ 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. శుక్రుడు త్వరలో నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. శుక్రుడి నక్షత్ర సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. మరి శుక్రుని రాశి మార్పుతో ఏయే రాశులు వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రుడు ప్రేమ, సంతోషం, విలాసాలు, ధనం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు నవంబర్ 7, శుక్రవారం రాత్రి 9:13కి రాహువు నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది అనేక రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను పొందుతారు. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు. సంతోషంగా ఉంటారు. మరి ఏ రాశుల వారికి ప్రత్యేక లాభాలు కలుగుతాయి? ఎవ...