Hyderabad, సెప్టెంబర్ 4 -- అఖండ 2 మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇప్పుడు వాళ్లకు బాలకృష్ణ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అఖండ 2 ఎప్పుడు వస్తుందో రివీల్ చేశాడు.

గురువారం (సెప్టెంబర్ 4) బాలకృష్ణ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అఖండ 2 మూవీ రిలీజ్ పై స్పందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు వెల్లడించాడు. "అఖండ 2 త్వరలోనే వస్తోంది. సెప్టెంబర్ 25న కాదు. డిసెంబర్ తొలి వారంలో వస్తుంది.

తమన్ కు కాస్త ఎక్కువ సమయం కావాల్సి వచ్చింది. అఖండ సమయంలోనే ఆ మ్యూజిక్ కు వూఫర్లు బద్ధలైపోయాయి. ఇక ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ సినిమా కంటే రెట్టింపు కాదు 50 రెట్లు ఎక్కువ ఉండబోతోంది. సినిమా బాగా రావాలన్నదే ...