భారతదేశం, జూలై 18 -- 2012లో అంతరిక్షం నుంచి భూమి మీదకు దూకి, స్పీడ్​ ఆఫ్​ సౌండ్​ని సైతం బ్రేక్​ చేసిన ఆస్ట్రియన్​ డేర్​డెవిల్​ ఫీలిక్స్​ బౌమ్​గార్ట్​నర్​ మృతిచెందారు! ఇటలీలో జరిగిన ఒక పారాగ్లైడ్​ యాక్సిడెంట్​ వల్ల ఆయన మరణించారు. ఆయన వయస్సు 56ఏళ్లు.

ఇటలీ నగరమైన పోర్టో సాంట్​ ఎల్పిడియాలో ఈ ఘటన జరిగింది. పారాగ్లైండింగ్​ చేస్తూ.. ఒక స్విమ్మింగ్​ పూల్​ దగ్గర ఆయన క్రాష్​ అయ్యరని తెలుస్తోంది. ఆయన మరణాన్ని నగర మేయర్​ ధ్రువీకరించారు.

"ఫీలిక్స్​ బౌమ్​గార్ట్​నర్​ మరణించారన్న వార్త విషాదానికి గురిచేసింది. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఫీలిక్స్​, ధైర్యసాహసాలకు చిహ్నం. పోరాటానికి చిహ్నం," అని మేయర్​ మస్సిమిలియానో అన్నారు.

"ఫియర్‌లెస్ ఫెలిక్స్" గా ప్రసిద్ధి చెందిన ఈ ఆస్ట్రియన్​ స్కైడైవర్, 2012లో న్యూ మెక్సికో మీదుగా భారీ హీలియం బెలూన్ ద్వారా భూమికి 24...