భారతదేశం, ఏప్రిల్ 26 -- Yodha OTT Streaming: రాశీ ఖ‌న్నా బాలీవుడ్ మూవీ యోధ ఓటీటీలోకి వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన న‌ల‌భై రోజుల త‌ర్వాత ఈ బాలీవుడ్‌ యాక్ష‌న్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో యోధ మూవీ శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు 349 రూపాయ‌లు అద‌నంగా డ‌బ్బులు చెల్లించాల్సివుంటుంది.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన యోధ మూవీలో వ‌రుణ్‌ధావ‌న్ హీరోగా న‌టించాడు. రాశీఖ‌న్నాతో పాటు దిశాప‌టానీ హీరోయిన్లుగా క‌నిపించారు. భారీ బ‌డ్జెట్‌తో క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. రొటీన్ కాన్సెప్ట్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఆడియెన్స్ థియేట‌ర్ల‌లో ...