భారతదేశం, ఫిబ్రవరి 8 -- Yami Gautam: బాలీవుడ్ స్టార్ నటి, హీరోయిన్ యామీ గౌతమ్, ఆమె భర్త, ఫిల్మ్ మేకర్ ఆదిత్య ధార్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. వారికి త్వరలో తొలి సంతానం కలగనుంది. యామీ గౌతమ్ ప్రస్తుతం గర్భిణిగా ఉన్నారు. ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 8) జరగగా.. ఆ విషయాన్ని ఇద్దరూ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం యామీ గౌతమ్ ఐదున్నర నెలల గర్భిణిగా ఉన్నారు. ఈ విషయంపై వారిద్దరూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో మాట్లాడారు.

ఆర్టికల్ 370 మూవీలో యామీ గౌతమ్ ప్రధాన పాత్ర పోషించగా.. ఆదిత్య ధార్ నిర్మాతగా ఉన్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు వైట్ డ్రెస్‍పై బ్లేజర్ ధరించి వచ్చారు యామీ. బేబీ బంప్‍తో కనిపించారు.

గర్భిణిగా ఉన్న సమయంలోనూ ఆర్టికల్ 370 సినిమా షూటింగ్‍లో పాల్గొన్నట్టు యామీ గౌతమ్ చెప్పారు. ఆ సమయంలో తన మదిలో చాలా ప్రశ్నలు తలెత్తాయ...