భారతదేశం, మే 10 -- Yakshini Web Series: బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ తెలుగులో ఓ హార‌ర్ వెబ్‌సిరీస్ చేస్తోన్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ వెబ్‌సిరీస్‌కు య‌క్షిణి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్ కాబోతోంది. శుక్ర‌వారం ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ అభిమానుల‌తో పంచుకున్న‌ది. లీడ్ రోల్స్ ఎవ‌రు లేకుండా కేవ‌లం షాడోను మాత్ర‌మే చూపిస్తూ డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. య‌క్షిణి వ‌స్తుంది అంటూ పోస్ట‌ర్‌ను ఉద్దేశించి ఇచ్చిన క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతుంది.

హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో వేదిక, రాహుల్ విజ‌య్‌, అజ‌య్‌, మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. య‌క్షిణ...