భారతదేశం, ఏప్రిల్ 30 -- వేసవి వచ్చిందంటే వేడితో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఇక మనం రోజూవారీ అవసరాల కోసం ఉపయోగించే నీరు కూడా వేడిగా మారుతుంది. దీంతో వాటిని ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. సూర్యరశ్మితో వేడి అయిన నీటిని స్నానానికి ఉపయోగిస్తే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆ నీటిని చల్లగా చేసేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. సాధారణంగా దాదాపు ప్రతీ ఒక్కరి ఇంటిపై నల్లటి వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఎక్కువగా దీనినే ఉపయోగిస్తారు. మిగతా కాలాల్లో సమస్యలేమీ ఉండవు కానీ.. వేసవి వచ్చిందంటేనే ఈ నీటితో సమస్య మెుదలవుతుంది.

మధ్యాహ్నంపూట ఈ ట్యాంకులోని నీరు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. స్నానం చేయాలని అనిపించినా.. ఆ వేడి నీటితో మీకు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే వాటర్ ట్యాంక్ నీటిని వేసవిలో చల్లగా చేసుకోవాలి. అందుకోసం కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. అప్పుడే బ...