Hyderabad, ఏప్రిల్ 20 -- Vijayendra Prasad About Ruslaan Movie: బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం 'రుస్లాన్'. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ని నిర్వహించింది. ప్రముఖ తెలుగు రచయిత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. "శివకి కథపై చాలా పాషన్ ఉంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేకపోత...