భారతదేశం, ఏప్రిల్ 20 -- Varun Sandesh Ninda Movie: ఒక‌ప్పుడు హ్యాట్రిక్ స‌క్సెస్‌ల‌తో టాలీవుడ్ వ‌రుణ్ సందేశ్ పేరు మారుమ్రోగింది. యూత్ ఫేవ‌రేట్ హీరోగా మారిపోయాడు. ఆ త‌ర్వాత ఫ్లాపులు అత‌డి కెరీర్‌కు అడ్డంకిగా మారాయి. ప్ర‌స్తుతం ఓ స‌క్సెస్‌తో క‌మ్ బ్యాక్ ఇచ్చేందుకు చాలా రోజుల నుంచి వెయింటింగ్ చేస్తున్నాడు. కెరీర్‌లో ఎక్కువ‌గా ల‌వ్ స్టోరీస్ చేసిన వ‌రుణ్ సందేశ్ తాజాగా త‌న రూట్ మార్చాడు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ మూవీకి నింద అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందుతోన్న నింద మూవీకి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో క‌థ‌కు సంబంధించి ప‌లు హింట్స్ ఇచ్చారు. ఊరి వాతావరణం, ఓ చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువం...