భారతదేశం, ఫిబ్రవరి 9 -- Valentines Day Re-Releases: వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) కోసం ప్రేమికులు ఎంతో ఎదురుచూస్తుంటారు. తమ మనసుకు నచ్చిన వారితో సమయం గడిపేందుకు, సర్‌ప్రైజ్ చేసేందుకు వేచిచూస్తుంటారు. ఈ తరుణంలో వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చే వారం ఫిబ్రవరి 14న ఏకంగా నాలుగు ఫీల్ గుడ్ లవ్ సినిమాలు థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నాయి. మరోసారి వెండితెరపై మెరవనున్నాయి. ఆ వివరాలివే..

సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఓయ్' సినిమా 2009లో రిలీజ్ అయింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఆకట్టుకున్నా.. కమర్షియల్‍గా అంత హిట్ కాలేదు. అయితే, ఆ తర్వాత టీవీల్లో బాగా ఆకట్టుకుంది. దీంతో క్లాసిక్‍గా చాలా మంది మదిలో నిలిచిపోయింది. ఈ చిత్రం సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చే వారం ఫిబ్రవరి 14న ఓయ్ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, త...