భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఏడాది పొడవునా ప్రేమికులు ఎదురుచూసేరోజు ఫిబ్రవరి 14. చాలా మంది ఏం గిఫ్ట్ ఇవ్వాలోనని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వారమంతా జంటలు ఒకరితో ఒకరు ఆనందంగా గడుపుతారు. అయితే ఇందులో అత్యంత ప్రత్యేకమైనది ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. మీరు కచ్చితంగా ఈసారి మీ భాగస్వామికి అందమైన బహుమతి ఇవ్వాలనుకుంటే మీ కోసం కొన్ని ఐడియాలు ఉన్నాయి. వాటితో వారిని హ్యాపీ చేయండి.

కలిసి గడిపిన చిరస్మరణీయ క్షణాలను ఒకే చోటుకు తీసుకురండి. మీరు కలిసి దిగిన ప్రతి ఫోటోతో ఆల్బమ్‌ను తయారుచేయించండి. మీరు ఫొటో కింద ఆ క్షణానికి సంబంధించిన చిన్న క్యాప్సన్ రాయవచ్చు. మీ సొంత మాటల్లో రాస్తే ఇంకా బాగుంటుంది. మీ లవర్ కి మీరు అంటే ఎంతో ఇష్టమో వాలెం...