భారతదేశం, మే 7 -- TS ICET 2024 : తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. తెలంగాణ ఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 5న విడుదల చేయగా, ఏప్రిల్ 30 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. అనంతరం దరఖాస్తు గడువును మే 7 వరకు పొడిగించారు. అయితే ఈ గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఇవాళ్టి వరకు ఐసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. అదే విధంగా రూ.250 ఆలస్య రుసుముతో మే 17వ తేదీ వరకు వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్లలో సవరణలకు మే 17 నుంచి 20వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. ఐసెట్ హాల్ టికెట్లను మే 28న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఐసెట్ పరీక్షను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఐసెట్ ఫలితాలు జూన్ 28న వెబ్ సైట్ ల విడుదల చేయ...