భారతదేశం, మే 7 -- Varalakshmi Sarathkumar: తెలుగు, త‌మిళ భాష‌ల్లో వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న‌ది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. లేడీ విల‌న్ రోల్స్ అన‌గానే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మి పేరు ఫ‌స్ట్ ఛాయిస్‌గా వినిపిస్తోంది. నెగెటివ్ షేడ్ రోల్స్‌లో ప‌తాక స్థాయిలో విల‌నిజాన్ని పండిస్తూ ప్ర‌తిభ‌ను చాటుకుంటోంది. విల‌న్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో లీడ్ రోల్స్ చేస్తోంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన శ‌బ‌రి మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజై డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

కాగా 2019లో సందీప్‌కిష‌న్ హీరోగా న‌టించిన తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ మూవీతో విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు ఏడేళ్ల ముందే వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌ కుమార్ హీరోయిన్‌గా ...