భారతదేశం, మార్చి 29 -- Tillu Square Twitter Review: 2024లో యూత్ ఆడియెన్స్ అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో టిల్లు స్వ్కేర్ ఒక‌టి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2022లో రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించిన డీజే టిల్లుకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ మూవీ తెర‌కెక్కింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ శుక్ర‌వారం రిలీజైంది. ఈ సినిమా ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

త‌న ట్రేడ్ మార్క్ కామెడీతో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టిల్లు స్క్కేర్‌లోనూ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. డీజే టిల్లుగా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ బాడీలాంగ్వేజ్‌, పంచ్ డైలాగ్స్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని చెబుతున్నారు. సిద్ధు వ‌న్ మెన్ షోగా టిల్లు స్క్వేర్ మూవ...