భారతదేశం, ఏప్రిల్ 26 -- Theater Ads Time: కొవిడ్ త‌ర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరిగింది. అప్ప‌టివ‌ర‌కు థియేట‌ర్ల‌లో సినిమా చూసేందుకు అల‌వాటుప‌డిన ఆడియెన్స్ ఓటీటీల వైపు మ‌ళ్లారు. కొవిడ్ సంక్షోభం ముగిసినా థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూసే ప్రేక్ష‌కుల సంఖ్య మాత్రం పెర‌గ‌లేదు. మ‌రోవైపు థియేట‌ర్‌, ఓటీటీ రిలీజ్ డేట్ మ‌ధ్య గ్యాప్ త‌గ్గ‌డం కూడా థియేట‌ర్ల‌కు ఎదురుదెబ్బ‌గా మారింది. ఇప్పుడు స్టార్ హీరోలు సినిమాలు సైతం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వ‌స్తున్నాయి. దాంతో థియేట‌ర్ల రెవెన్యూ చాలా ప‌డిపోయింది.

సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మ‌ల్టీప్లెక్స్‌లు కూడా ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాయి. నానాటికి థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య త‌గ్గ‌డంతో యాజ‌మాన్యాలు డైలామాలో ప‌డుతోన్నాయి. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషించే ప‌నిలో ప‌డ్డారు.

ముఖ్యం...