భారతదేశం, మార్చి 4 -- Sound Party OTT Release Date: సీరియల్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీజే సన్నీ.. బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్‍తో చాలా పాపులర్ అయ్యాడు. ఆ సీజన్‍లో విజేతగా నిలువడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ జోష్‍తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

సౌండ్ పార్టీ సినిమా ఫేమస్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ 'ఆహా'లో అడుగుపెడుతోంది. మార్చి 8వ తేదీన ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (మార్చి 4) అధికారికంగా వెల్లడించింది.

"సౌండ్ డీటీఎస్‍లో మోగిద్దామా. ఆహాలో సౌండ్ పార్టీ. మార్చి 8న ప్రీమియర్ కానుంది" అని ఆహా ట...