తెలంగాణ,సిరిసిల్ల, ఏప్రిల్ 28 -- Rajanna Sircilla District : ఉపాధి కల్పిస్తామంటూ విదేశాలకు తీసుకెళ్లి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. అంతర్జాతీయ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న నెట్ వర్క్ ను రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. ఉపాధి కోసం కంబోడియాకు వెల్లి కష్టాలు పడుతున్న తన కొడుకును కాపాడాలని ఓ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో సైబర్ క్రైమ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం టూరిస్టు వీసాలను... జాబ్ వీసాలని చెప్పి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ ముఠా మాత్రం ఎంప్లాయిమెంట్ కల్పిస్తామని చెప్పి కంబోడియాకు తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం కంబోడియాలోని చైనీస్ కంపెనీల్లో సైబర్ మోసాలు చేయిస్తున్న ముఠాకు చెందిన జగి...