భారతదేశం, ఫిబ్రవరి 13 -- Sheesh Mahal Movie: టాలీవుడ్ క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన శీష్ మ‌హ‌ల్ మూవీ థియేట‌ర్ల‌లో ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ కాబోతోంది. ఆ త‌ర్వాత వారం గ్యాప్‌లోనే ఓటీటీలో శీష్ మ‌హాల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ అంథాల‌జీ మూవీని ఫిబ్ర‌వ‌రి 14 నుంచి హైద‌రాబాద్‌లోని ఐమాక్స్ థియేట‌ర్‌లో స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. ఫిబ్ర‌వ‌రి 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో శీష్ మ‌హాల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ ట్రైల‌ర్‌ను ఈటీవీ విన్ ఓటీటీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. శీష్ మ‌హ‌ల్ మూవీకి క్యాంప్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

హైద‌రాబాద్‌లోని ఓ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు క‌థ‌ల‌తో అంథాల‌జీగా శీష్ మ‌హ‌ల్ మూవీ తెర‌కెక్కుతోంది. ఫిలిం ఫెస్టివ‌ల్ కోసం సినిమా చేయాల‌ని సంక‌ల్పించిన కొంద‌రు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు? త‌...