భారతదేశం, మే 4 -- Sexual assault in Delhi Metro: 16 ఏళ్ల బాలుడు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' లో పోస్ట్ చేశాడు.సమయ్ పూర్ బద్లీ వైపు వెళ్తున్న మెట్రో ట్రైన్ ను రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో ఎక్కిన తర్వాత తోటి ప్రయాణికుడు తనపై లైంగిక దాడి (Sexual assault in Delhi Metro)కి ప్రయత్నించాడని భవ్య అనే ఆ బాలుడు వివరించాడు. ఈ ఘటనతో తాను చాలా భయపడిపోయానని, వణికిపోయానని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

''ఢిల్లీ మెట్రోలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో నాపై లైంగిక దాడి జరిగింది. నేను 16 ఏళ్ల బాలుడిని. నేను మెట్రోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాను. నేను మొదట ఈ ఘటనపై రెడ్డిట్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశాను. అయితే, ఎక్స్ లో పోస్ట్ చేయమని, ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేయమని పలువురు సూచించడంతో ఇక్కడ పోస్ట్ చేస్త...