భారతదేశం, మార్చి 11 -- SBI electoral bonds hearing : ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ఈ మేరకు.. వివరాలను సమర్పించేందుకు జూన్​ 30 వరకు సమయం కావాలని ఎస్​బీఐ వేసిన పిటిషన్​ని పక్కనపెట్టేసింది. మంగళవారం నాటికి.. ఎట్టిపరిస్థితుల్లోనైనా వివరాలను సమర్పించాలని, ఆ వివరాలను.. ఎన్నికల సంఘం.. మార్చ్​ 15 నాటికి తమ వెబ్​సైట్​లో పబ్లీష్​ చేయాలని తేల్చిచెప్పింది.

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ఎస్​బీఐకి భారీ షాక్​ తగిలినట్టు అయ్యింది.

రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి నిధులను అనుమతించే కేంద్ర ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చుతూ.. స్కీమ్​ని ఇటీవలే రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఏప్రిల్​...