భారతదేశం, ఫిబ్రవరి 21 -- Sammakka Saralamma Medaram Jatara: మేడారం జాతర కోసం మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో కాలినడకన బయలు దేరిన పెనక వంశస్తులు మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకోగా.. బుధవారం ఉదయం అక్కడి నుంచి మేడారం బయలుదేరారు.

బుధవారం సాయంత్రంలోగా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నారు. కాగా బుధవారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది.

మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజున సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం మహాజాతర telangana kumbha mela ప్రారంభమవుతుంది. గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా సారలమ్మతో పాటే బుధవారమే గద్దెలపై కొలువుదీరుతారు.

బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులైన వడ్డె...