భారతదేశం, ఏప్రిల్ 26 -- Sahya First Look: ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్ మూవీలో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది మౌనిక రెడ్డి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మూవీతో తెలుగునాట క్రేజ్‌ను సంపాదించుకున్న మౌనిక రెడ్డి తాజాగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. స‌హ్య పేరుతో ఓ మైథ‌లాజిక‌ల్ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతోన్నారు.

స‌హ్య మూవీ ఫస్ట్ లుక్ ను సీనియ‌ర్ హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌త్తి ప‌ట్టుకొని ఓ యోధురాలిగా మౌనిక‌రెడ్డి క‌నిపిస్తోంది. ఆమె చేతుల‌తో పాటు దుస్తుల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండటం ఆస‌క్తిని పంచుతోంది. అర్జున్ మాట్లాడుతూ... "కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా గా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ తో త...