భారతదేశం, ఏప్రిల్ 30 -- Sabari Movie: వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ న‌టించిన తెలుగు మూవీ శ‌బ‌రి మే 3న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అనిల్ కాట్జ్ 'శబరి' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కితోన్న శ‌బ‌రి మూవీ గురించి ప్ర‌మోష‌న్స్‌లో ద‌ర్శ‌కుడు అనిల్ కాట్జ్‌ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల్ని వెల్ల‌డించారు. అవి ఏమిటంటే?

నాలుగైదేళ్ల క్రితం శ‌బ‌రి మూవీ చేయాల‌నే ఆలోచన వచ్చింది. ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే... అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది అన్న‌దే శ‌బ‌రి ద్వారా నేను చెబుదామనుకున్న పాయింట్. తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఈ పాయింట్ చెబితే బావుంటుందని శ‌బ‌రి కథ రాసుకున్నా. ...