భారతదేశం, ఏప్రిల్ 24 -- Raviteja Movie: సినిమా ప్రొడ‌క్ష‌న్ అంటేనే కోట్ల‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. చిన్న సినిమాను నిర్మించాల‌న్న బ‌డ్జెట్ ఐదు కోట్ల వ‌ర‌కు అవుతుంది. అదే స్టార్ హీరోతో సినిమా అంటే బ‌డ్జెట్‌కు లిమిట్స్ కూడా ఉండ‌వు. ఒక్కోసారి అనుకున్న‌దానికంటే రెట్టింపు కూడా అవుతుంది. కానీ ర‌వితేజ, ఛార్మి హీరోహీరోయిన్లుగా న‌టించిన దొంగ‌ల‌ముఠా మూవీ మాత్రం కేవ‌లం ఆరున్న‌ర ల‌క్ష‌ల బ‌డ్జెట్‌లోనే కంప్లీట్ అయ్యింది.

దొంగ‌ల‌ముఠా మూవీని త‌క్కువ బ‌డ్జెట్‌లో లిమిటెడ్ టెక్నిషియ‌న్స్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించాడు. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి కేవ‌లం ఏడుగురు టెక్నిషియ‌న్స్ మాత్ర‌మే ప‌నిచేశారు. ఈ ఐదుగురిలో పూరి జ‌గ‌న్నాథ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, హ‌రీష్ శంక‌ర్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్‌చేశారు. మ...