Hyderabad, ఏప్రిల్ 27 -- Sai Pallavi Ranbir Kapoor First Look Leaked: బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం మూవీ కోసం ఆసక్తిగా భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు, పాత్రల వివరాలను రహస్యంగా ఉంచారు. కానీ, సినిమాలో రాముడిగా యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఫొటోలు జూమ్ టీవీ ద్వారా లీక్ అయ్యాయి. ఈ ఫొటోలతో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నట్లు రివీల్ అయింది. అయోధ్య యువ రాజుగా సాంప్రదాయ దుస్తులు ధరించిన రణ్‌బీర్, యువరాణి లుక్‌లో సీతగా సాయి పల్లవి ఫొటోలు శనివారం (ఏప్రిల్ 27) రామాయణ సెట్స్ నుంచి లీకయ్యాయి.

చారిత్రక ఇతిహాసంపై తెరకెక్కుతున్న ఈ సిని...