భారతదేశం, మే 8 -- Rajadhani Files: రాజ‌ధాని ఫైల్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కాకుండా యూట్యూబ్‌లో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా రాజ‌ధాని ఫైల్స్ మూవీని యూట్యూబ్‌లో చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఏపీ రాజ‌కీయాల‌పై తీసిన ఈ మూవీ టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. భాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అఖిల‌న్‌, వీణ‌, వినోద్‌కుమార్‌, వాణి విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించాడు.

అమ‌రావ‌తి విష‌యంలో రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం చేసిన అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూ రాజ‌ధాని ఫైల్స్‌ మూవీ రూపొందింది. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం చాలా ప్ర‌య‌త్న...