భారతదేశం, మార్చి 21 -- Lok sabha elections: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎత్తిచూపుతూ, పార్టీ ఖాతాలన్నీ స్తంభింపజేశామని, లోక్ సభ ఎన్నికలకు ఎలాంటి ప్రచారాన్ని చేపట్టలేని పరిస్థితి నెలకొని ఉన్నదని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమేనని రాహుల్ గాంధీ అన్నారు. నిధులు అందుబాటులో లేని కారణంగా తాము ఎలాంటి ప్రచారం చేయలేకపోతున్నామని, ప్రకటనలు బుక్ చేయలేకపోతున్నామని, తమ నాయకులను ప్రచారానికి పంపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారానికి రెండు ...