భారతదేశం, ఫిబ్రవరి 13 -- Pv Sindhu on Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌పై బ్యాడింట‌న్ స్టార్ పీవీ సింధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో త‌న ఫేవ‌రేట్ హీరోలు ఎవ‌ర‌న్న‌ది కూడా ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో పీవీ సింధు రివీల్ చేసింది. బ్యాడ్మింట‌న్ కార‌ణంగా ఎదుర‌య్యే ఒత్తిడి నుంచి దూరం కావ‌డానికి సినిమాలు బాగా చూస్తాన‌ని పీవీ సింధు అన్న‌ది. కొత్త పాత అనే తేడాలు లేకుండా అంద‌రి సినిమాలు చూస్తాన‌ని అన్న‌ది.

ప్ర‌భాస్ త‌న ఫేవ‌రేట్ హీరో అని చెప్పింది పీవీ సింధు. ప్ర‌భాస్ యాక్టింగ్ బాగుటుంద‌ని, అత‌డు న‌టించిన అన్ని సినిమాలు చూస్తాన‌ని సింధు అన్న‌ది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్‌తో మాట్లాడే అవ‌కాశం రాలేద‌ని చెప్పింది. ప్ర‌భాస్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్ త‌న ఫేవ‌రేట్ యాక్ట‌ర్ అని పీవీ సింధు చెప్పింది. రామ్‌చ‌ర‌ణ్‌ను...