భారతదేశం, ఏప్రిల్ 28 -- పిల్లలు నిజంగా చాక్లెట్లు, చక్కెర, క్రీమ్ నిండిన కుకీలు, బిస్కెట్లను రుచి చూడటానికి ఇష్టపడతారు. అయితే బిస్కెట్లు పిల్లలకు నిజంగా ఆరోగ్యకరమా? అస్సలు కాదు. పిల్లలకు బిస్కెట్లు, కుకీలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎందుకు నివారించమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నిజానికి పిల్లలకు పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే సమస్యలు వస్తాయి.

బిస్కెట్లు, కుకీలు రెండూ అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెరలతో తయారు చేస్తారు. ఇవి తెలియకుండానే కేలరీలను జోడించవచ్చు. బరువు పెరుగుతారు. దంత సమస్యలను ప్రేరేపిస్తాయి. చిన్న వయస్సులోనే టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.

పిల్లలు కుకీలు, బిస్కెట్లను ఇష్టపడతారన్నది ఎంత నిజమో.....