Hyderabad, ఏప్రిల్ 27 -- This Weekend OTT Best Movies: ఎవ్రీ వీక్ సరికొత్తగా, క్రేజీ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలో దర్శనం ఇచ్చి ఊరిస్తుంటాయి. వాటిలో బెస్ట్ మాత్రమే ట్రెండింగ్‌లో ఉండి దూసుకుపోతుంటాయి. అలా ఈ వారం వీకెండ్‌కు మంచి టైమ్ పాస్ కోసం చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు ఉన్నాయి. వీటిలో నాలుగు డిఫరెంట్ జోనర్‌కు చెందినవి కావడం విశేషం. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

మ్యాచో హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భీమా (Bhimaa OTT). మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ సినిమాగా పేరు తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌కు కాస్తా మైథాలజీ టచ్ ఇచ్చి డైరెక్టర్ ఏ హర్ష తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్ స్థానంలో దూసుకుప...