భారతదేశం, మే 12 -- Zara Hatke Zara Bachke OTT: 'జర హట్కే జర బచ్కే' (ZHZB) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా గతేడాది జూన్ 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ 'జర హట్కే జర బచ్కే' హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ అయింది. అయితే, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం 11 నెలలుగా చాలా మంది నిరీక్షిస్తున్నారు. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.

'జర హట్కే జర బచ్కే' మూవీ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ మే 17న జియో సినిమాలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రా...