భారతదేశం, మే 8 -- MSP For Wet Paddy : తెలంగాణలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు స్వల్పంగా నష్టపోయాయి. అయితే పంట నష్టంపై రైతులు అధైర్యపడొద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ఉంటుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద అర్హులైన రైతులకు రూ.15 వేలు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

గత రెండు రోజుల...