Hyderabad, మే 9 -- మునగాకులను పురాతన కాలం నుండి ఆహారంగా, ఔషధంగా వినియోగిస్తున్నారు. దీనిలో అద్భుతమైన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. పాలతో పోలిస్తే మునగాకుల్లోనే అధికంగా కాల్షియం ఉంటుంది. అలాగే క్యారెట్ల కంటే విటమిన్ ఎ పది రెట్లు అధికంగా ఉంటుంది. మునగాకు తినడం వల్ల మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. మీ జీవక్రియను మెరుగుపరచడంతో పాటూ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు, కాలేయాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మునగాకులు ఎంతో మేలు చేస్తాయి.

మునగాకుల్లో నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, క్యారెట్ల కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ, పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, పెరుగు కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ ప్రోటీన్, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొ...