భారతదేశం, ఏప్రిల్ 24 -- Monkey Man OTT: మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌. స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఫేమ్ దేవ్ ప‌టేల్ హీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా ఈ హాలీవుడ్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అయితే ఇండియ‌న్ ఆడియెన్స్ మాత్రం మంకీ మ్యాన్‌ను ఓటీటీలో చూసేందుకు అవ‌కాశం లేదు. కేవ‌లం అమెరికా, కెన‌డాతో పాటు మ‌రికొన్ని దేశాల్లో మాత్రమే ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.

ఏప్రిల్ 5న అమెరికాలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ సెన్సార్‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా రిలీజ్‌ వాయిదాప‌డింది.

అమెరికాలో మంకీమ్యాన్‌ మూవీ ఓటీటీలో రిలీజైన నేప‌థ్యంలో ఇండి...