భారతదేశం, ఫిబ్రవరి 13 -- Merry Christmas OTT Release: విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్‌ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. మార్చి 8న మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

మెర్రీ క్రిస్మ‌స్ మూవీ జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తికి జోడీగా క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, క‌త్రినాకైఫ్ యాక్టింగ్‌తో ...