భారతదేశం, మే 1 -- May Tollywood Releases 2024: సినిమా ఇండ‌స్ట్రీకి బెస్ట్ సీజ‌న్స్‌లో స‌మ్మ‌ర్ ఒక‌టి. వేస‌విలో స్టార్ హీరోల సంద‌డితో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతోంటాయి. అయితే ఈ సారి స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో సీన్ రివ‌ర్స్‌లో ఉంది. ఐపీఎల్‌తో పాటు ఎల‌క్ష‌న్స్ కార‌ణంగా పెద్ద హీరోలు ఎవ‌రూ బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌లేదు.

ఒక్క స్టార్ హీరో మూవీ కూడా వేసిలో రిలీజ్ కాలేదు. మే నెల‌లో రిలీజ్ కావాల్సిన ప్ర‌భాస్ క‌ల్కితో పాటు ప‌లు పెద్ద సినిమాలు వాయిదాప‌డ‌టంతో ఈ గ్యాప్‌ను వాడుకునేందుకు ప‌లు మీడియం, లో బ‌డ్జెట్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. ఈ సినిమాలు ఏవంటే?

మే ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. త‌న‌కు అచ్చొచ్చిన కామెడీ జోన‌ర్‌లో అల్ల‌రి న‌రేష్ చేసిన ఆ అక్క‌టి అడ‌క్కు మూవీ మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. మ‌ల్లి అంకం ద‌ర్శ‌...