భారతదేశం, ఏప్రిల్ 27 -- Maruti Suzuki Swift : భారత దేశ ఆటోమొబైల్​ మార్కెట్​ ఎంత మారినా, ఎస్​యూవీలు ఎంతలా దండయాత్ర చేసినా.. చెక్కుచెదరకుండా.. లాంచ్​ అయిన 19ఏళ్లకు కూడా సూపర్​ డిమాండ్​ అందుకుని, బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా రాణిస్తోంది మారుతీ సుజుకీ స్విఫ్ట్​. ఎఫ్​వై 2023-24లో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో మూడో స్థానంలో నిలిచింది. మరి ఈ హ్యాచ్​బ్యాక్​ని భారతీయులు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు? ఇందులోని ప్రత్యేకతలేంటి? ఇక్కడ తెలుసుకుందాము..

2005లో తొలిసారి భారత్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది మారుతీ సుజుకీ స్విఫ్ట్​. గత ఆర్థిక ఏడాదిలో 1,95,321 యూనిట్​లు అమ్ముడుపోయాయి. ఈ ఫిగర్​ చూస్తే చాలు.. స్విఫ్ట్​కి డిమాండ్​ ఎంత ఉందో తెలిసిపోతుంది. హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​, టాటా టియాగో వంటి మోడల్స్​ నుంచి పోటీ ఎదురవుతున్నా.. స్విఫ్ట్​ హ్యాచ్​బ్యాక్​ దూ...