భారతదేశం, మే 1 -- Mammootty Telugu Movies: టాలీవుడ్‌లో డ‌బ్బింగ్ సినిమాల‌తో స్టార్‌డ‌మ్ సంపాదించుకున్న హీరోల్లో మ‌మ్ముట్టి ఒక‌రు. మ‌ల‌యాళంలో ఆరు వంద‌ల‌కుపైగా సినిమాలు చేసిన మ‌మ్ముట్టి తెలుగులో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఆరు స్ట్రెయిట్ సినిమాల్లో మాత్ర‌మే న‌టించారు.

తెలుగులో ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో హీరోగా, విల‌న్‌గా అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని తిర‌స్క‌రించారు మ‌మ్ముట్టి. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్వాతికిర‌ణం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు మ‌మ్ముట్టి. ఇందులో అసూయ‌ద్వేషాల‌తో ర‌గిలిపోయే సంగీతకారుడి పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు.

స్వాతికిర‌ణం త‌ర్వాత 1997లో వ‌చ్చిన సూర్య‌పుత్రులు మూవీలో సుమ‌న్‌తో పాటు మ‌రో హీరోగా మ‌మ్ముట్టి క‌నిపించాడు. దాదాపు 22 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత దివంగ‌త సీఏం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి బ...