భారతదేశం, ఏప్రిల్ 24 -- Love Me Movie: దిల్‌రాజు వార‌సుడు ఆశిష్, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ల‌వ్ మీ మూవీ రిలీజ్ వాయిదాప‌డింది. ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ నెల రోజులు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. మే 25న ల‌వ్ మూవీ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు బుధ‌వారం సినిమా యూనిట్ ప్ర‌క‌టించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ల‌వ్ మీ మూవీతో అరుణ్ భీమవరపు డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

హార‌ర్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ల‌వ్ మీ మూవీకి ఆస్కార్ విన్న‌ర్‌ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌కు బ్యాడ్ సీజ‌న్ న‌డుస్తోంది. ఐపీఎల్ కార‌ణంగా థియేట‌ర్ల‌లో స...