భారతదేశం, ఏప్రిల్ 20 -- Love Guru OTT: బిచ్చ‌గాడు 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన ల‌వ్‌గురు. ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను స్వ‌యంగా విజ‌య్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేశాడు. ఏప్రిల్ 11న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

ల‌వ్ గురు సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మే 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంలో ఈ మూవీ రోమియో పేరుతో రిలీజైంది. త‌మిళ వెర్ష‌న్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. తెలుగులో ఆహా ఓటీటీ, త‌మిళంలో అమెజాన్ ప్రైమ్‌లో మే 3న ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. ఏప్రిల్ లాస్ట్‌వీక్‌లో ల‌వ్ గురు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్న...