భారతదేశం, మే 1 -- Lal Salaam OTT: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై మూడు నెల‌లు కావ‌స్తోన్న ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలోకి రాలేదు. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం అనుమాన‌మేన‌ని వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి 21 రోజుల ఫుటేజ్ మిస్స‌యిందంటూ ద‌ర్శ‌కురాలు ఐశ్వ‌ర్య‌ ర‌జ‌నీకాంత్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఫుటేజ్ వ‌ల్లే సినిమా అనుకున్న విధంగా రాలేదంటూ, థియేట‌ర్ల‌లో ఫ్లాప్ కావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మంటూ పేర్కొన్న‌ది.

ఆ ఫుటేజ్ మిస్సింగ్ వ‌ల్లే లాల్ స‌లామ్ ఓటీటీ రిలీజ్ స‌మ‌స్య‌గా మారిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.అయితే లాల్‌స‌లామ్ మూవీకి సంబంధించిన ఓటీటీ అడ్డంకులు క్లియ‌ర్ అయిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

స‌న్...