భారతదేశం, ఫిబ్రవరి 24 -- Khammam Politics : ఖమ్మం జిల్లా కారు పార్టీలో నైరాశ్యం అలుముకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల(TS Assembly Elections) ఫలితాలను నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ముంగిటికొచ్చిన లోక్ సభ ఎన్నికలపై అంతగా కసరత్తు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఫలితంగా జెండా మోసే కార్యకర్తల్లో నిస్తేజం కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections)పై జిల్లా బీఆర్ఎస్ (BRS)పార్టీ నాయకత్వం ఇంకా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. అటు ఖమ్మంలో, ఇటు మహబూబాబాద్ లోనూ గులాబీ పార్టీ పెద్దగా ఫోకస్ పెట్టినట్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఆ పార్టీ నాయకత్వం బయటకొచ్చినట్లు లేదు. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు చూ...