భారతదేశం, మే 9 -- Kajal Agarwal: పెళ్లి త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను త‌గ్గించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. తెలుగులో కాజ‌ల్ అగ‌ర్వాల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న స‌త్య‌భామ మూవీ మే 17న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో కాజ‌ల్ బిజీగా ఉంది.

స‌త్య‌భామ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా క‌మెడియ‌న్ అలీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి కాజ‌ల్ గెస్ట్‌గా వ‌చ్చింది. ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజైంది. ఈ షోలో గౌత‌మ్ కిచ్లూతో త‌న ప్రేమాయ‌ణం, పెళ్లితో పాటు కెరీర్‌పై కాజ‌ల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది

పెళ్లి త‌ర్వాత ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు...అలాంటి సినిమాలే చేయ‌మ‌ని మీ భ‌ర్త...