భారతదేశం, మే 10 -- Jacqueline Fernandez: ప్ర‌భాస్ సోహో మూవీలో ఐటెంసాంగ్‌లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఈ బోల్డ్ సుంద‌రి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు పేప‌ర్ బాయ్ ఫేమ్ జ‌యశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో వ‌చ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా డిఫ‌రెంట్ పాయింట్‌తో జాక్వెల‌న్ ఫెర్నాండేజ్ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ బ‌డ్జెట్‌, అత్యున్న‌త సాంకేతిక ప్ర‌మాణాల‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతో...