భారతదేశం, మార్చి 11 -- Indiramma Housing Scheme : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ (Congress Govt)మరో గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma Housing Scheme) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం(Financial Assistance) అందించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ...ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గిరిజనులు, దళితులకు మరో రూ.లక్ష అదనంగా కలిపి మొత్తంగా రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించారు. సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమ...