భారతదేశం, మే 7 -- Hyderabad City Tour : తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు సిటీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ సిటీ హెరిటేజ్-కమ్-మ్యూజియం డైలీ టూర్ ప్యాకేజీలో బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్‌ జంగ్ మ్యూజియం, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ సందర్శించవచ్చు.

అన్ని మ్యూజియంలు శుక్రవారం మూసివేస్తారు. దీని బదులుగా శుక్రవారం నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు. ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు టూర్ ప్యాకేజీ కవర్ చేస్తారు.

హైదరాబాద్ పట్టణానికి అతి చేరువలో ఉన్న వండర్ లా టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం అందిస్తోంది. వాటర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ ఫూల్, ఇంకా క్రేజీగా టూర్ ఎంజాయ్ చేసేందుకు వండర్ లా అద్...