భారతదేశం, ఏప్రిల్ 20 -- Hero Mavrick Scrambler 440 : హీరో మోటోకార్ప్ సంస్థ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఫ్లాగ్​షిప్​ బైక్​ అయిన మావ్రిక్ 440ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది హార్లే-డేవిడ్​సన్​తో కలిసి అభివృద్ధి చేసిన బైక్​. ఫలితంగా ఎక్స్​440తో దీనికి చాలా పోలికలే ఉన్నాయి. ఇక ఇప్పుడు.. హీరో మోటోకార్ప్ సంస్థ.. 'మావ్రిక్ 440 స్క్రాంబ్లర్' అనే పేరును ట్రేడ్​మార్క్​ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకుంది. ఇది.. మావ్రిక్​ 440కి మరో వేరియంట్​ లేదా వర్షెన్​ అని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

స్క్రాంబ్లర్ వెర్షన్ కోసం, హీరో మోటోకార్ప్ బైక్​లో కాస్మొటిక్స్​ పరంగా ఎక్కువ మార్పులు కనిపించొచ్చు. డ్యూయెల్ పర్పస్ టైర్లు, వెడల్పాటి హ్యాండిల్ బార్, కొత్త సీటు, విభిన్న ఫుట్ పెగ్​ల సెట్​ను ఆశించొచ్చు. సాధారణంగా స్క్రాంబ్లర్లు 19 ఇంచ్​ ఫ్ర...