భారతదేశం, ఫిబ్రవరి 13 -- Hanuman vs Sri Anjaneyam: తేజా స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌నుమాన్ మూవీ క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. 30 రోజుల్లో మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ్ట‌టింది. సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. హిందీలో నెల రోజుల్లోనే హ‌నుమాన్ మూవీకి 50.72 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. హిందీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సౌత్ డ‌బ్బింగ్ మూవీస్‌లో ఒక‌టిగా హ‌నుమాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు దాటినా హ‌నుమాన్ క‌లెక్ష‌న్స్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు.

హ‌నుమాన్ మూవీపై ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్రీ ఆంజ‌నేయం కూడా హ‌నుమంతుడి క‌థ‌తోనే తెర‌కెక్కింది. సామా...